కలం, వెబ్ డెస్క్ : రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు (TG EdCET 2026 Results) విడుదలయ్యాయి. ఈ మేరకు టీజీ ఎడ్‌సెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డిలు విడుదల చేశారు. కాకతీయ యూనివర్సిటీ తరఫున తెలంగాణ కౌన్సెల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఈ పరీక్ష మే 12న జరిగింది. పరీక్ష రాసిన 29, 342 మందిలో 28, 446 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. 96.95శాతం ఉత్తీర్ణత నమోదైంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ edcet.tgche.ac.inలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

