నా రాజకీయ జీవితంలో ఇలాంటి స్కామ్‌ చూడలేదు: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్ : అసెంబ్లీ లాబీలో నిర్వహించిన చిట్‌చాట్‌లో భాగంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 వ్యవహారంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి స్కామ్‌ను చూడలేదని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాల వల్ల ఎంతో మంది ప్రతిభావంతులైన మెరిట్ విద్యార్థులు బలయ్యారని మండిపడ్డారు. ఈ అంశానికి సంబంధించి అన్ని విషయాలపై ఎల్లుండి సభలో సమగ్రంగా చర్చిస్తామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని మహిళా టీచర్లు చేసిన ర్యాలీపై సీఎం చంద్రబాబు స్పందించారు. డీఎస్సీలో ఎక్కువ మంది మహిళా టీచర్లే ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే వారు రోడ్లపైకి రావాల్సి వచ్చిందని, మహిళా టీచర్లకు డీఎస్సీతో విడదీయరాని ఎమోషనల్ బాండింగ్ ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. డీఎస్సీ పారదర్శకంగా నిర్వహించామని.. ప్రతిపక్ష పార్టీ అనవసరపు రాద్ధాంతం చేస్తుందని ఫైర్ అయ్యారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>