కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా ఉన్న ఇన్ సర్విస్ టీచర్స్ కు టెట్(TET) అర్హత తప్పనిసరి అని సుప్రీం కోర్టు తీర్పు (Supreme Court Verdict) ఇచ్చిన నేపధ్యంలో వచ్చే రెండేళ్లలో సర్వీసులో ఉన్న టీచర్లంతా టెట్‌లో అర్హత సాధించకుంటే వారంతా ఉద్యోగాలు కోల్పోవలసి ఉంటుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లగా టీచర్స్ గా పని చేస్తూ రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న వారు కొత్తగా టెట్ పాస్ అవ్వడం కస్టతరమని టెట్ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు ఆల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ (AISTF) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జి సదానందం గౌడ్ అధ్యక్షతన ఆదివారం రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఏఐఎస్టీఎఫ్(AISTF) జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టెట్ మినహాయింపు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీనికి పలు రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. విద్యాహక్కు చట్టం అమలుకు ముందు ఉద్యోగాలు పొందిన టీచర్స్ అంతా టెట్ పాస్ అవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని అన్నారు.
అఖిల భారత జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఉద్యమం నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో టెట్ జరుగుతున్న నేపధ్యంలో సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ ‘టెట్’కు హాజరయ్యేందుకు ఆన్ డ్యూటీ (OD) సౌకర్యం కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, టీజీ టెట్ ఛైర్‌పర్సన్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also: రూబెన్ అమోరిమ్‌కు మాంచెస్టర్ షాక్ !
Follow Us On : WhatsApp


