సిద్దిపేటలో ఉద్రిక్తత.. బీజేపీ ఆఫీసు ముట్టడికి కాంగ్రెస్ యత్నం

కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట (Siddipet) జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముట్టడి యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగి స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ భారీ పోలీస్ బందోబస్తు, ఉద్రిక్త పరిస్థితుల నడుమ కూడా కాంగ్రెస్ నాయకులు తమ నిరసనను కొనసాగించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>