కలం, జోగుళాంబ గద్వాల: కేటీదొడ్డి (KT Doddi) మండలంలోని ఇర్కిచెడు, ఇర్కిచెడు తండా, పాగుంట, ముసల్ దొడ్డి, వెంకటాపురం, కొండాపురం గ్రామాల విద్యార్థులు రవాణా సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్, డిగ్రీ చదువుల కోసం ధరూర్, గద్వాల వెళ్లేందుకు ప్రతిరోజూ ఉదయం 7 కి.మీ, సాయంత్రం 7 కి.మీ కాలినడకన కొండాపురం బస్సు స్టాప్‌కు రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సరైన బస్సు ప్రయాణ సౌకర్యం లేకపోవడం వల్ల ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకు దూరమవుతున్నారని వాపోయారు. ఈ తీవ్రమైన సమస్యపై తక్షణమే స్పందించి తమ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్ట్ కార్డుల ద్వారా వినతి సమర్పించారు.

