Mobile Popup Ad
Mobile Popup Ad

దుబ్బాక ప్ర‌జాపాల‌న స‌భ ర‌సాభస..

కలం, మెద‌క్ బ్యూరో : దుబ్బాక (Dubbaka) నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప్రజా పాలన – ప్ర‌గ‌తి నివేదిక‌ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్ర‌జా పాల‌న కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (MLA Kotha Prabhakar) దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ధాన్యం కోనుగోళ్లు స‌రిగా జ‌ర‌గ‌డం లేద‌ని , ధర్నాలు చేయ‌వ‌ల‌సిన ప‌రిస్ధితి వ‌స్తుంద‌ని స‌మావేశంలో రైతులకు మద్దతుగా నేలపై కూర్చొని నిర‌స‌న తెలిపారు.

ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోళ్లపై దృష్టి పెట్టి రైతులను ఆదుకోవాల‌ని కోరారు. ఎమ్మెల్యే మాట్ల‌డుతున్న క్ర‌మంలో అధికారులు మైక్ కట్ చేశారు. దీంతో ఆగ్ర‌హించిన‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మైకులు నేలకేసి కొట్టారు. ఎమ్మెల్యేకి మద్దతుగా బీఅర్ఎస్ నాయకులు ఫంక్షన్ హాల్ లోపలికి చొచ్చుకువచ్చేందుకు ప్ర‌య‌త్నించిగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు గేట్లను తోసుకుంటూ ఫంక్షన్ హాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో (MLA Kotha Prabhakar) కలిసి నాయకులు ధర్నా చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read Also: డీలిమిటేషన్ మోడల్ పై కవిత సంచలన ప్రతిపాదన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>