మరికాసేపట్లో సీఎంతో ఉద్యోగ జేఏసీ భేటీ

కలం, వెబ్ డెస్క్ : ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు (TEJAC) మరికొద్దిసేపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమావేశం కానున్నారు. నిన్న డిప్యూటీ సీఎంతో సుదీర్ఘంగా చర్చలు జరిగిన ప్రక్రియకు కొనసాగింపుగా ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డితో మీటింగ్ ఏర్పాటైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, ఉపాధ్యాయులు.. ఇలా సుమారు 206 సంఘాలతో కూడిన జేఏసీ ప్రతినిధులు మొత్తం 63 డిమాండ్లతో ప్రభుత్వానికి మెమొరాండం సమర్పించారు.

పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను పీఆర్సీలో విలీనం చేస్తామని, త్వరలోనే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని జేఏసీ ప్రతినిధులతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని డిప్యూటీ సీఎం నిన్ననే స్పష్టం చేశారు. రైటర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం వంద రోజుల్లోపే ఒకేసారి రూ. 6 వేల కోట్లను ఇస్తామని, ప్రతి నెలా వెయ్యి కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులకు నిధులు విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మొత్తం డిమాండ్లలో 26 పాక్షికంగా అమలయ్యాయి. డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 5న ఒక రోజు నిరాహార దీక్ష చేయాలని ఇప్పటికే ప్రధాన కార్యదర్శికి మెమొరాండం ఇవ్వడంతో దాన్ని నివారించడంలో భాగంగా నిన్న డిప్యూటీ సీఎం, నేడు సీఎం రేవంత్‌రెడ్డి జేఏసీ ప్రతినిధులను సమావేశానికి పిలవడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>