కలం, వరంగల్ బ్యూరో : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ‘సే నో టు డ్రగ్స్’ (Say No to Drugs) అంశంపై శనివారం హనుమకొండ (Hanumakonda) లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హనుమకొండ అదాలత్ సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు సాగింది. ర్యాలీని వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలలో అవగాహన కల్పించడం అత్యవసరమని తెలిపారు.
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మానవహారం నిర్వహించి, పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ధార కవిత, అదనపు డీసీపీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీడబ్ల్యూఓ విశ్వజ, పోలీస్, ఎక్సైజ్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఈగల్ టీమ్ సభ్యులు, ఆశా వర్కర్‌లు , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

