Mobile Popup Ad
Mobile Popup Ad

నీట్ అభ్యర్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

కలం, నిర్మల్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు నిర్మల్ (Nirmal) డిపో మేనేజర్ పండరి శనివారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక సౌకర్యం అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ కేంద్రాల్లో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్ చూపించి సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని నీట్ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>