కలం, ఖమ్మం బ్యూరో: బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్ (Kothagudem Club) లో నిర్వహించిన సర్ ప్రక్రియపై, పార్టీ సమన్వయ సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా ఇంచార్జ్ తక్కెళ్లపల్లి రవీంద్ర మాట్లాడుతూ.. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించేవారు పార్టీనీ వీడాలని వ్యాఖ్యానించారు. దీంతో వనమా రాఘవా సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అనంతరం రాఘవ వర్గీయులకు పార్టీ నేతలకు మధ్య ఒక్కసారిగా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమావేశంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగడంతో వాతావరణం వేడెక్కింది.
ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కొందరు కార్యకర్తలు అక్కడున్న కుర్చీలను విరగ్గొట్టారు. దీంతో కాసేపు అక్కడ ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. సమావేశంలో గొడవ పెద్దదవుతున్న తరుణంలో అక్కడే ఉన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju Ravichandra) వెంటనే స్పందించారు. పరస్పరం ఘర్షణకు దిగుతున్న కార్యకర్తలను, స్థానిక నాయకులను ఆయన శాంతింపజేశారు. పార్టీ అంతర్గత విషయాలను సామరస్యంగా మాట్లాడుకోవాలని, ఇలాంటి ఘర్షణలు సరికాదని నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత సమావేశం యథావిధిగా కొనసాగింది.
Read Also: ఈ రకం వేస్తే కొనం.. రైతులకు మిల్లర్ల షాక్..!
Follow Us On: X(Twitter)

