Mobile Popup Ad
Mobile Popup Ad

డిజిట‌ల్ కేబినెట్‌కు తెలంగాణ స‌ర్కార్ ఆమోదం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలన దిశగా మరో కీలక అడుగు వేసింది. కేబినెట్ సమావేశాలను పూర్తిగా పేపర్‌లెస్‌గా నిర్వహించేందుకు తెలంగాణ డిజిటల్ కేబినెట్‌ (Telangana Digital Cabinet)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కొత్త విధానంపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంత్రులకు ప్రత్యేక ట్యాబ్‌ల‌ను అందజేశారు. ఇకపై కేబినెట్ సమావేశాలకు సంబంధించిన ఎజెండాలు, నోట్స్, కీలక పత్రాలు అన్నీ డిజిటల్ రూపంలోనే అందుబాటులో ఉండనున్నాయి. దీంతో కాగితాల వినియోగం తగ్గడంతో పాటు పరిపాలన మరింత వేగవంతం, పారదర్శకంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also: ఎమ్మెల్యేల ప‌నితీరుపై కాంగ్రెస్ సీక్రెట్ సర్వే..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>