epaper
Wednesday, February 18, 2026
epaper

తొర్రూరులో హైటెన్షన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ

కలం, జనగామ: కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్‌ల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీ (Thorrur Municipality) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు వ్యతిరేక నినాదాలు చేస్తూ మున్సిపాలిటీ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నాయకులు ఘర్షణకు దిగడంతో యుద్ధ వాతావరణం నెలకొంది.

అంతకుముందు పెంబర్తి జాతీయ రహదారి వద్ద తొర్రూరుకు చెందిన బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు వెళ్తున్న బస్సును కాంగ్రెస్ (Congress) నాయకులు అడ్డుకున్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం కార్యకర్తలు అడ్డుకోవడంతో జాతీయ రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు చెందిన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

Read Also: నిజామాబాద్ మేయర్‌గా ఉమారాణి పేరు ఖరారు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>