ఖమ్మం అంబేడ్కర్ భవన్ వద్ద ఉద్రిక్తత..!

క‌లం, వెబ్ డెస్క్‌: ఖ‌మ్మం (Khammam) జిల్లా వెలుగుమ‌ట్ల‌ (Velugumatla)లో భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులు నిర‌స‌న‌కు దిగారు. దీంతో అంబేడ్క‌ర్ భ‌వ‌న్ వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. అక‌స్మాత్తుగా త‌మ ఇండ్లూ కూల్చి ప్ర‌భుత్వం త‌మ‌ను రోడ్డుపాలు చేశార‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రోడ్డుపై కూర్చొని, ప‌డుకొని నిర‌స‌న తెలిపారు. మ‌హిళ‌లు, వృద్ధులు క‌న్నీళ్లు పెట్టుకుంటూ త‌మ‌ను దిక్కులేని వాళ్ల‌ను చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. పోలీసులు త‌మ‌పై లాఠీ చార్జ్ చేశార‌ని, ప‌లువురు గాయ‌ప‌డ్డార‌ని చెప్తున్నారు. అంబేడ్క‌ర్ భ‌వ‌న్ వ‌ద్ద‌కు పోలీసులు భారీ ఎత్తున మోహ‌రించారు. నిర‌స‌న‌కారుల‌ను చెద‌ర‌గొడుతున్నారు. పోలీసులు, వెలుగుమ‌ట్ల బాధితుల‌కు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

Read Also: మావోయిస్టు సాంబయ్య సరెండర్.. మరో 14 మంది సైతం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>