ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. టెల్ అవీవ్‌లో తెలుగు వాళ్ల పరిస్థితి ఏమిటి?

కలం, నిజామాబాద్ బ్యూరో: ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తున్నది. ఇరాన్ సుప్రీం‌ లీడర్ ఖమేనీ మృతితో ఇరాన్ భారీగా ప్రతీకారదాడులు చేస్తోంది. దీంతో ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రజలు (Telugu Residents) బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్ నగరంలో భారీ సంఖ్యలో తెలుగు ప్రజలు ఉంటున్నారు. దీంతో వీరంతా బంకర్లలో తలదాచుకుంటున్నారు. ’నిన్నటి నుంచి మిస్సైల్స్ దూసుకొస్తున్నాయి. ఇప్పటివరకూ ఎనిమిది మిస్సైల్స్ రాగా ప్రతీసారీ అలారం మోగింది. అలారం శబ్ధం వినగానే బంకర్‌లలోకి వెళ్లి తలదాచుకుంటున్నాం’  అని టెల్అవీవ్ సిటీలో ఉంటున్న నిజామాబాద్ జిల్లా వాసులు, ఏపీ వాసులు చెబుతున్నారు. నిన్నటి నుంచి నిద్ర కూడా లేదని కొంతమంది చెబుతున్నారు.

ఇజ్రాయెల్‌లో 50 వేల మంది భారతీయులు

ఇజ్రాయెల్‌లో దాదాపుగా 50 వేలమంది భారతీయులు ఉంటున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు (Telugu Residents) రెండు వేల మంది. ఇక నిజామాబాద్ జిల్లా‌కు చెందిన అనేకమంది టెల్అవీవ్ నగరంలో ఉంటున్నారు. ఆలూరు మండలం దేగాం గ్రామానికి చెందిన 100 మందికి‌పైగా జనాలు టెల్ అవీవ్ లోనే ఉంటారు. అయితే ఇరాన్ ప్రయోగిస్తున్న మిస్సైల్స్ ఇజ్రాయిల్‌వైపు కంటిన్యూగా దూసుకొస్తున్నాయి. ఇప్పటివరకు ఒక్క టెల్‌అవీవ్‌లోనే ఎనిమిది మిస్సైల్స్ దూసుకొచ్చాయని నిజామాబాద్ జిల్లాకు చెందిన సోమ రవి చెప్పారు.

అక్కడి పరిస్థితులు ఆయన మాటల్లోనే.. ‘నిన్నటి నుంచి మిస్సైల్స్ వస్తున్నాయి.. మిస్సైల్స్ వస్తుంటే ప్రత్యేక అలారం సిస్టం మోగుతున్నది. సెల్‌ఫోన్‌లోకి కూడా అలర్ట్ మెసేజ్‌లు వస్తాయి. అందరూ వెంటనే అప్రమత్తం కావాలి. అలారం వచ్చినప్పుడు సెల్లార్‌లలోకి వెళ్లాలి. ప్రాబ్లం ఏమీ లేదు కానీ హడావుడి ఉంటుంది. ఉరుకులు పరుగులు ఉంటాయి. కానీ నిర్లక్ష్యం చేయొద్దు. ఫోన్‌లు ఇయర్‌ఫోన్‌లు వాడొద్దు. గతంలో ఒక అమ్మాయి ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని వెళ్తుంటే అలారం వినిపించలేదు. దీంతో ఆమె చనిపోయింది‘ అంటూ ఆయన గుర్తు చేశారు. ఇండియన్ ఎంబసీ కూడా మేసేజ్ పంపిస్తుందని చెప్పారు. దాడులు నేపథ్యంలో పనులన్నీ నిలిచిపోయాయి. అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరూ టెన్షన్ పడొద్దు. మా కుటుంబాల వారు కూడా ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ మా క్షేమ సమాచారం కనుకుంటున్నారు.’  అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Read Also: ఇరాన్‌లో యుద్ధంతో ‘బాస్మతి’ ధరలు పతనం.. ఆందోళనలో హర్యానా రైతాంగం

Follow Us On: Sharechat

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>