కలం, సినిమా : టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) ఎట్టకేలకు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి వివాహం ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్ళికి.. వారికి అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. అయితే మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రిసెప్షన్‌కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
ఇప్పటికే విజయ్, రష్మిక జంట స్వయంగా ఆహ్వానాలను అందజేస్తున్నారు. తాజాగా రష్మిక మందన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి, తమ వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం ఫ్యామిలీతో రష్మిక మందన్న దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Read Also: శరత్ కుమార్ రెండో భార్యపై మొదటి భార్య ప్రశంసలు..
Follow Us On: Instagram

