కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో స్పోర్ట్స్ స్టేడియం (Bhadrachalam Stadium) నిర్మాణానికి జిల్లా కలెక్టర్ అంకిత్ 5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో నివసించే యువత కలలు సాకారం అవుతోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Tellam Venkat Rao) కోరిక మేరకు ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో ఎమ్మెల్యే ఈ రోజు స్టేడియం కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అలాగే క్రీడా ప్రాంగణం నిర్మించడానికి అవసరమైన అంచనాలను రూపొందించి త్వరగా ప్రభుత్వానికి నివేదించాల్సిందిగా జిల్లా క్రీడల అధికారి ఎం. పరంధామ రెడ్డిని కోరడం జరిగింది. గిరిజన ప్రాంత యువతకు వీలైనంత త్వరగా ఈ స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు.
Read Also: సచివాలయంలో గోదావరి పుష్కర ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
Follow Us On: X(Twitter)

