కలం, వెబ్ డెస్క్: గోదావరి నదీ పుష్కరాలకు (Godavari Pushkaralu) హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) ఆదేశించారు. ఈ మేరకు గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంత రావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. నిజామాబాద్ కందకుర్తి నుండి బాసర, భద్రాచలం వరకు 8 జిల్లాల్లో గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఉందని చెప్పారు.
ఈ జిల్లాల్లో పుష్కర స్నానాలకై పెద్ద సంఖ్యలో ప్రజానీకం వచ్చే ఛాన్స్ ఉన్నందున పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ పుష్కర ఏర్పాట్లపై ఇప్పటికే సీఎం రేవంత్ తగు సూచనలు చేశారని, వారి ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లపై ప్రతిపాదనలను రూపొందించాలని చెప్పారు. ఈ ప్రతిపాదనలను గోదావరి పుష్కరాలపై (Godavari Pushkaralu) ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించాలన్నారు. పుష్కర ఏర్పాట్లపై చేపట్టాల్సిన పనులపై ఇప్పటికే నియమించిన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్ల కమిటీ ప్రతిపాదిత పుష్కర పనులను పరిశీలించాలని సూచించారు.
Read Also: నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలు విడుదల
Follow Us On: X(Twitter)

