కలం, వెబ్ డెస్క్: ఫ్యూచర్ సిటీ (Future City) కమిషనరేట్ పరిధిలో ప్రజలకు వేగవంతంగా పోలీస్ సేవలు అందించాలనే లక్ష్యంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఆన్‌సైట్ ‘FIR’ (సంఘటనా స్థలంలోనే కేసు నమోదు) విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండన్నగూడ గ్రామంలో ఓ మహిళ మెడలో నుంచి గొలుసు దొంగతనం జరిగింది. బాధితురాలు వీరమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఆమె తన పొలం వద్ద కూర్చుని ఉండగా, గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైకిల్‌పై వచ్చాడు. బైక్‌ను కొంత దూరంలో ఆపాడు. ఆ తర్వాత వెనుక నుంచి వచ్చి ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న సుమారు 4 తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యాడు.
సమాచారం అందిన వెంటనే షాద్‌నగర్ ఏసీపీ సత్యనారాయణ, సీఐ సీతారాం, ఎస్సై శివారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అక్కడికక్కడే ఆన్‌సైట్ ‘FIR‘ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ (Future City Commissionerate) పరిధిలో ప్రజల భద్రత కోసం ఇలాంటి మరిన్ని పద్ధతులను అమలు చేస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.
Read Also: నకిలీ నోట్ల పేరుతో విదేశీయుడి మోసాలు.. తిప్పర్తిలో అరెస్ట్
Follow Us On: Pinterest

