Mobile Popup Ad
Mobile Popup Ad

రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొగడ్తల వర్షం

కలం, నల్లగొండ బ్యూరో: సొంత ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై నిత్యం విమర్శలు గుప్పించే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) తాజాగా పంథా మార్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. మునుగోడు మండలం పులిపలుపుల గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారని వ్యాఖ్యానించారు. బడి.. గుడితో సమానమని, ప్రతి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి తన వంతు కృషి చేస్తున్నానన్నారు. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో చదివి 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి వరుసగా రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.7500 ప్రోత్సాహకం అందించామని, ఈ విద్యా సంవత్సరానికి ఈ ప్రోత్సాహకాన్ని పెంచుతున్నామన్నారు. ఈసారి పదవ తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు అందిస్తామన్నారు.

విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావాలి

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో అత్యున్నత స్థాయికి వెళ్లిన వారంతా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్లేనని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువు గొప్పగా ఉంటుందని చెప్పారు. మనం మన కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తామో సమాజంలో ఉన్న పేద వాళ్ళ గురించి.. గ్రామం, ప్రాంతం గురించి ఆలోచించినప్పుడే ప్రభుత్వ బడులు, ప్రాంతం అభివృద్ధి చెందుతాయని ఆయన (Rajagopal Reddy) తెలిపారు. మా అమ్మ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద తాను జీవించి ఉన్నంత వరకు పేదలకు ఆర్థిక సహాయం చేస్తూనే ఉంటామన్నారు.

Read Also: తెలంగాణ జాగృతిలో చేరిన పలువురు నాయకులు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>