Mobile Popup Ad
Mobile Popup Ad

అప్రోచ్ రోడ్ల నిర్మాణాలకు రూ.148 కోట్లు విడుదల : డిప్యూటీ సీఎం భట్టి

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో అప్రోచ్ రోడ్ల నిర్మాణాలకు రూ.148 కోట్ల నిధుల విడుదలకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. బుధవారం జరిగిన ఇన్ఫ్రా స్ట్రక్చర్, క్యాపిటల్ వర్క్స్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న అప్రోచ్ రోడ్ల పనులను వెంటనే చేపట్టాలని అధికారులను భట్టి ఆదేశించారు. మూడేళ్ల క్రితం బ్రిడ్జీలు నిర్మించినప్పటికీ వాటికి అప్రోచ్ రోడ్లు లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయన్నారు. వీటి నిర్మాణానికి సరైన పద్ధతిలో ప్రతిపాదనలు పంపిస్తే ఆమోదం తెలపడంతో పాటు అమలు చేయడం సులభం అవుతుందన్నారు. 1:4 నిష్పత్తిలో వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు పంపితే చర్చించి ఆమోదం తెలుపుతామని భట్టి సూచించారు.

అలాగే, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని.. జూన్ 8వ తేదీ లోపల అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రగతి పనులపై ప్రతి సోమవారం సమీక్షిస్తానని తెలిపారు. టెండర్లు పిలవడం, పనులు చేపట్టడం, పనుల్లో నాణ్యత లాంటి అన్ని అంశాలను పర్యవేక్షిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Read Also: మోదీపై తీవ్ర వ్యాఖ్యలు.. ఖర్గేకు నోటీసులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>