Mobile Popup Ad
Mobile Popup Ad

రాములబండలో ఘనంగా రథోత్సవం.. రథాన్ని లాగిన మంత్రి కోమటిరెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda) మండలం రాములబండ (Ramulabanda) గ్రామంలో శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) గ్రామస్థులతో కలిసి రథోత్సవాన్ని లాగారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ గ్రామస్థులంతా ఒక్కటిగా కలిసి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అభినందనీయం అని అన్నారు.

ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆ శ్రీరాముని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఛత్రపతి  శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, స్థానిక సర్పంచ్ చామకూరి శంకర్ గౌడ్, ప్రకాష్ రెడ్డి, గ్రామస్థులు  తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>