కలం డెస్క్: స్విట్జర్లాండ్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF 2026) నిర్వహించే దావోస్ సమ్మిట్ (Davos Summit) వేదికపై తెలంగాణ ప్రభుత్వం ఈసారి సరికొత్త నినాదాన్ని ఇవ్వనున్నది. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి నమూనాను అంతర్జాతీయ ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలకు పరిచయం చేయనున్నది. ఫ్యూచర్ సిటీ (Future City) వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి విజన్ డాక్యుమెంట్ (Vision Document)ను ఇటీవలే విడుదల చేసింది. అందులో ప్రస్తావించిన క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) కాన్సెప్టును వివరించనున్నది. విజన్ డాక్యుమెంట్‌లో ప్రస్తావించినట్లుగా 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకునే రోడ్ మ్యాప్‌పై అవగాహన కలిగించనున్నది. ఈ నెల 19-23 తేదీల్లో జరిగే ఈ సమ్మిట్‌కు ముఖ్యమంత్రి, పరిశ్రమల మంత్రి, వివిధ శాఖల అధికారులు హాజరవుతున్నారు.
మూడంచెల ఆర్థిక వృద్ధి వ్యూహం :
విజన్ డాక్యుమెంట్‌లో లక్యాన్ని నిర్దేశించుకోవడం మాత్రమే కాక అది సాకారం కావడానికి అనుసరించే విధానాలను, రోడ్ మ్యాప్‌ను దావోస్ (WEF 2026) వేదికగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు వివరించనున్నారు. లక్ష్య సాధనకు మూడంచెల ఆర్థిక వృద్ధి వ్యూహంపై అవగాహన కలిగించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రంగాలవారీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లను ఆయా శాఖల అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రపంచ పెట్టుబడిదారులకు తెలంగాణ డెవలప్‌మెంట్ రోడ్ మ్యాప్ గురించి వివరించి పెట్టుబడులను ఆకర్షించే ప్రణాళికతో దావోస్ పర్యటన సాగనున్నది. గత రెండేళ్ల దావోస్ పర్యటనల సందర్భంగా, ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025లో వచ్చిన పెట్టుబడులపై ఇప్పటికే సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి ఈసారి రికార్డు స్థాయిలో ఎంఓయూలు కుదుర్చుకోవడంపై దృష్టి పెట్టారు.
Read Also: ఇక పోలీస్ స్టేషన్ వెళ్లక్కర్లేదు.. మీ ఇంటికే ‘సీ-మిత్ర’!
Follow Us On : WhatsApp


