కలం వెబ్ డెస్క్ : ఖమ్మం(Khammam)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత(Married Woman)ను గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు. కస్బా బజార్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మహిళ మృతదేహం సమీపంలో భారీ మొత్తంలో కరెన్సీ నోట్లు ఉన్నాయి. పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలు పాల్వంచ పట్టణానికి చెందిన ప్రమీలగా గుర్తించారు. ప్రమీల నెల రోజుల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. ఒంటరిగా ఖమ్మం(Khammam)లోని లేడీస్ హాస్టల్‌లో ఉంటూ ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తోంది. ప్రమీల ఇటీవల శ్రవణ్ వేధిస్తున్నాడంటూ భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా హత్యకు గురికావడం పలు అనుమానాలకు దారితీస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


