కలం, వెబ్ డెస్క్: కామారెడ్డి (Kamareddy) జిల్లా మాచిరెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల వరల్డ్ ట్విన్స్ డే సందర్భంగా కవలలైన అక్కాచెల్లెళ్లను కవల సోదరులు (Twin Marriage) పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తీవ్ర విషాదం ఏంటంటే.. కవలల్లో ఒకరైన దుంపటి వినయ్ కుమార్ (31) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వినయ్, ఉగాది పండుగ రోజున ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
కుటుంబ సభ్యులు గాలించగా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న మానేరు డ్యామ్ ప్రాజెక్టులో దూకి ప్రాణాలు విడిచినట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం బయటకు తీశారు. ఈ అఘాయిత్యానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ఇరువురి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

