హనుమకొండలో టూరిజం మొబైల్ మ్యూజియం ప్రారంభం

కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టూరిజం మొబైల్ మ్యూజియాన్ని (Mobile Tourism Museum) కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గురువారం ప్రారంభించారు. హనుమకొండ (Hanamkonda) కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ మొబైల్ మ్యూజియం మూడు రోజులపాటు అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన ఛాయాచిత్రాలు, ప్రత్యేక ప్రదర్శనలు ఈ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణ.

పర్యాటక ప్రాంతాల విశేషాలు, సందర్శనకు సంబంధించిన సమాచారం, పర్యాటకులకు అవసరమైన బ్రోచర్లు, సమాచార పుస్తకాలను కూడా అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, పర్యాటక రంగాన్ని మరింతగా ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ మొబైల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ అధికారి శ్రీనివాస్ కుమార్, ఎన్ఐసీ అధికారి శ్రీధర్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎండీ అయూబ్ అలీ, టీజీవో అధ్యక్షుడు జగన్ మోహన్, రాజేశ్​, ప్రవీణ్ కుమార్, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, సందర్శకులు పాల్గొన్నారు.

Read Also: మోదీ పాల‌న‌లో 93 ప‌రీక్ష‌ల‌ పేప‌ర్ లీకులు: సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>