శాతవాహన యూనివ‌ర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తాం: వీసీ ఉమేష్ కుమార్‌

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యా వారోత్సవాల సందర్భంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శాతవాహన విశ్వవిద్యాలయ (Satavahana University) పరిపాలనా భవనంలో శాతవాహన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బోర్డ్ మీటింగ్ నిర్వ‌హించారు. దీనికి అధ్యక్షత వహించిన ఉప కులపతి ఆచార్య ఉమేష్ కుమార్ (VC Umesh Kumar) మాట్లాడుతూ.. ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బోర్డు విశ్వవిద్యాలయ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలని, దీనికి ప్రెసిడెంట్‌గా ఉప కులపతి వ్యవహరిస్తారని తెలియజేశారు. విశ్వ విద్యాలయానికి మౌలిక వసతులు కల్పించడంలో, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంలో ఈ ట్రస్టు ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు. ట్రస్ట్‌కు సంబంధించిన రిజిస్టర్ కాపీని విడుద‌ల చేశారు.

ట్రస్ట్ సెక్రటరీ రిజిస్టార్ ఆచార్య సతీష్ కుమార్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో (Satavahana University) విద్యా వారోత్సవాల సందర్భంగా చేయాల్సిన‌ కార్యక్రమాల గురించి, వర్సిటీ అభివృద్ధి పథంలో నడవడానికి కావాల్సిన‌ మౌలిక వసతుల గురించి క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పారు. వీటిని దృష్టిలో పెట్టుకొని నూతన విద్యా సంవత్సరంలో ప్రణాళికలు వేసి విద్యార్థులకు అన్ని రకాల వసతులు ఏర్పాట్లకై ప్రయత్నాలు చేస్తామన్నారు. శాతవాహన విద్యా ట్రస్ట్ దీని కొరకు ముందుకు రావడం చాలా హ‌ర్షించ‌ద‌గ్గ‌ విషయమని తెలియజేశారు. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ… ఉత్తర తెలంగాణలో ఏర్పాటైన‌ ఈ శాతవాహన విశ్వవిద్యాలయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అన్ని వేళలా ఈ ట్రస్ట్ ముఖ్య భూమిక పోషిస్తుందని, విద్యా సంబంధమైన అన్ని విషయాల కొరకు కావాల్సిన‌ సలహాలు, సాంకేతిక మౌలిక వసతుల గురించి అన్ని ఏర్పాట్లను శాతవాహన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ దీపిక, వీసీ ఓఎస్డీ డాక్టర్ హరికాంత్, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల సమన్వయ అధికారి డాక్టర్ ఎస్ రమాకాంత్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు నిరంజనా చారి, ఎదుగంటి ప్రసాదరావు, ఇతర సభ్యులు పాల్గొని శాతవాహన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బలోపేతం గురించి చర్చించారు.

Read Also: నల్లగొండ గులాబీ కోటలో హరీశ్ సీక్రెట్ ఆపరేషన్..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>