కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రం అతి త్వరలోనే మావోయిస్టు రహిత రాష్ట్రంగా అవతరిస్తుందని డీజీపీ శివధర్ రెడ్డి (Shivadhar Reddy) చెప్పారు. మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో తెలంగాణకు చెందిన నేతలు 17 మంది మాత్రమే ఉన్నారని, వారు కూడా త్వరలోనే లొంగిపోవాలని పిలుపునిచ్చారు. ఆ 17 మందికి చెందిన లిస్టు తమ వద్ద ఉందని డీజీపీ వివరించారు. ఈ మావోయిస్టులపై రూ.2 కోట్ల 25 లక్షల ప్రభుత్వ రివార్డు ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ 17 మంది మావోయిస్టుల పార్టీలోని ఆయా కమిటీల్లో సభ్యులుగా ఉన్నట్టు వివరించారు. సెంట్రల్ కమిటీలో నలుగురు లేదా ఐదుగురు, స్టేట్ కమిటీలో 5 నుంచి 6గురు, డివిజన్ కమిటీలో 6 నుంచి ఏడుగురు సభ్యులున్నట్టు వివరించారు. డీజీపీ శివధర్ రెడ్డి విడుదల చేసిన లిస్టు ప్రకారం చూస్తే..
సెంట్రల్ కమిటీలో ముప్పాల లక్ష్మణ్ రావు, పసునూరి నరహరి, మల్లారాజి రెడ్డి, తిప్పిరి తిరుపతి ఉన్నారు. స్టేట్ కమిటీలో వార్త శేఖర్, జోడే రత్నాభాయ్, నక్కా సుశృల, లోకేటి చంద్రశేఖర్, ముప్పిడి సాంబయ్య, దామోదర్ ఉన్నారు. డివిజన్ కమిటీలో బాడిషా ఉంగా, రంగబోయిన భాగ్య, సంగీత, భవాణి, రాజేశ్వరి, మైసయ్య, భగత్ సింగ్ ఉన్నారు. వీరందరూ ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సదుపాయాలను వినియోగించుకుని జనజీవనంలో కలిసిపోవాలని డిజీపీ పిలుపునిచ్చారు. లొంగిపోతున్న మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం మంచి అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు.

Read Also: సాహితీ ఇన్‌ఫ్రా కుంభకోణం.. పోలీసుల ఛార్జ్‌షీట్
Follow Us On : WhatsApp


