తెలంగాణ DNAలోనే టెక్స్ టైల్ ఉంది:సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : హైటెక్స్ లో ఏషియన్ టెక్స్ టైల్స్ కాన్ఫరెన్స్ 2026 (ATEXCON) లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. 13వ ATEXCON 2026 సదస్సులో పాల్గొంటున్న వారు అతిథులు మాత్రమే కాదు అభివృద్ధి భాగస్వాములు, మా విజన్‌ను పంచుకునే స్నేహితులు అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ DNAలోనే టెక్సటైల్ ఉందని.. నిజాం కాలంలో ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేసేవారని గుర్తు చేశారు. టెక్స్ టైల్ ఉత్పత్తిలో దేశంలోనే తాము నెంబర్ వన్ లో ఉన్నామని వెల్లడించారు.

టెక్స్ టైల్స్ కేవలం పరిశ్రమ కాదు..

శ్రీ రామనవమి సందర్భంగా మా సంప్రదాయం ప్రకారం తెలంగాణ ముఖ్య‌మంత్రి హోదాలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి పవిత్ర వస్త్రాలను సమర్పించడం తనకు గౌరవం అని ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. టెక్స్ టైల్స్ తమకు కేవలం పరిశ్రమ కాదని, అది జీవనాధారం అని వెల్లడించారు. ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కత్ నుండి గద్వాల్ చీరలు, వరంగల్ దుర్రీస్ నుండి నారాయణపేట చేనేత వరకు అనేకం ఇక్క‌డ ఉన్నాయని వివరించారు. భారతదేశంలో పత్తి ఉత్పత్తిలో తాము టాప్ లో ఉన్నామని.. తెలంగాణ పత్తి పొలాల నుండి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోల వరకు అనేక అంశాల్లో తాము కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

తెలంగాణలో నైపుణ్యం, సంకల్పం

తెలంగాణలో నైపుణ్యం, సంకల్పం ఉందని ఈ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డీప్ టెక్ , ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్ ,డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్, ఎనర్జీ ఇలా అనేక రంగాల్లో తెలంగాణ ముందంజ‌లో ఉందని వెల్లడించారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు, ఔషధాలు అందించిన రాష్ట్రం మాది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పర్యావరణ పరిరక్షణ మా అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. గ్రీన్ టెక్స్టైల్ హబ్‌లను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ప్రపంచ సినిమా కేంద్రంగా హైదరాబాద్

హైదరాబాద్ భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా సినిమా నిర్మాణ కేంద్రంగా ఎదుగుతోందన్న సీఎం.. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోలను ఇక్కడ ప్రారంభించారని గుర్తుచేశారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్‌ను తమ కేంద్రంగా ఉపయోగిస్తున్నాయని, ఇప్పుడు హాలీవుడ్ కూడా హైదరాబాద్ కు వస్తుందని వ్యాఖ్యానించారు. సినిమా రంగం తమ ఫ్యాషన్‌ను కూడా తెలంగాణ నుంచే పొందేలా ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ఆపిల్ ఇయర్‌పాడ్స్ కూడా ఇక్కడే తయారవుతున్నాయని వివరించారు.

పెట్టుబడిదారులకు సీఎం పిలుపు

తమ ప్రభుత్వం పెట్టుబడిదారులకు మౌలిక సదుపాయాలు, భూమి, విద్యుత్, నీరు, ప్రోత్సాహకాలల‌తో పాటు వేగంగా అనుమతులు మంజూరు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యువతకు, ముఖ్యంగా మహిళలకు, శిక్షణ అందిస్తాము. సంప్రదాయ ఆలోచ‌న‌ల‌ను ఆధునిక టూల్స్‌తో కలిపి డిజైన్, కట్టింగ్, స్టిచింగ్‌లో ఉపయోగించేలా చేస్తామని తెలిపారు ప్రపంచానికి సరితూగే విధానాలు తమ వద్ద ఉన్నాయని, అత్యుత్తమ మానవ వనరులు బలం మాకు ఉందని చెప్పారు. తమతో కలిసి వచ్చే పెట్టుబడిదారులతో ప్రపంచాన్ని మార్చగల పూర్తి టెక్స్టైల్ ఎకోసిస్టమ్‌ను ని నిర్మిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో భాగంగా 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాలో టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని వివరించారు. ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి దేశంలో తెలంగాణలో తయారైన దుస్తులు ధరించేలా చేయాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో భాగ‌స్వాములు కావాలని ఏషియన్ టెక్స్ టైల్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>