టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అభ్యర్థులకు బిగ్ అలర్ట్. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు టెట్ ఫలితాల(TET Results)ను విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి https://tgtet.aptonline.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకుని పీడీఎఫ్ కాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

లక్ష మందికి పైగానే..

టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా గత నెల 15వ తేదీన టెట్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,15,028 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. డీఎస్సీ ఫలితాల్లో టెట్ వెయిటేజీ 20 శాతం ఉంటుంది. దీనిలో అత్యధిక మార్కులు సాధించడమే అభ్యర్థులు సిద్ధమవుతుంటారు. ఈసారి పేపర్–1 కొంత సులభంగా వచ్చినా.. పేపర్–2 మాత్రం కఠినంగానే వచ్చింది. దీంతో పాస్ పర్సంటేజీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

కేటగిరీల వారీగా కనీస మార్కులు ఇలా..

టెట్ పరీక్షను 150 మార్కులకు నిర్వహించగా.. వీటిలో కనీస మార్కులు సాధించినవారినే పరిగణనలోకి తీసుకుంటారు. ఓసీ అభ్యర్థులు 90 మార్కులు, బీసీ అభ్యర్థులు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన అభ్యర్థులు 60 మార్కులు పొందాల్సి ఉంటుంది. అప్పుడే డీఎస్సీ పరీక్షకు అర్హత సాధిస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>