నిర్మల్ జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‌తో రైతు మృతి

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా సోన్ మండలం న్యూ బొప్పారం గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ రైతు మృతిచెందాడు. గ్రామానికి చెందిన రాచర్ల ముత్యం (48) ఆదివారం పొలం పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కరెంట్ సరఫరా జరుగుతుందో లేదో చూసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి ట్రాన్స్‌ఫార్మర్‌పై పడడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న ముత్యం ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య రాచర్ల సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గోపి పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>