వనపర్తిలో ఎస్‌ఐఆర్ ప్రచారానికి శ్రీకారం

కలం, వనపర్తి: సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమాన్ని ప్రతి అర్హత కలిగిన పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే(Wanaparthy MLA) తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) పిలుపునిచ్చారు. ప్రజలలో అవగాహన కల్పించేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో ప్రచార వాహనాన్ని ఆదివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు మూలస్తంభమని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ యువకులు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని, అలాగే ఓటరు జాబితాలో పేరు నమోదు కాకపోయిన వారు, చిరునామా మార్పు, పేరు లేదా ఇతర వివరాల సవరణ, తొలగింపు వంటి సేవలను ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ద్వారా పొందవచ్చని వివరించారు.

భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటరు వివరాలను సరిచూసుకోవాలని ఆయన కోరారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా సంబంధిత బూత్ లెవల్ అధికారులను సంప్రదించి వెంటనే దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రజలలో అవగాహన పెంచేందుకు మున్సిపాలిటీ చేపట్టిన ఆటో ప్రచారం అభినందనీయమని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రతి వార్డు, వీధి, కాలనీలో ఈ ప్రచారం చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ప్రజలు కూడా అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షుడు విజయవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్‌లు , ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>