Mobile Popup Ad
Mobile Popup Ad

వెరీ షేమ్.. పాక్ క్రికెటర్‌ను కొంటారా, SRHపై నెటిజన్స్ ఫైర్

కలం, వెబ్ డెస్క్: ‘ది హండ్రెడ్ లీగ్’ కోసం జరిగిన వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్​ను సన్‌రైజర్స్ లీడ్స్ (Sunrisers) దక్కించుకోవడం భారత్‌లో తీవ్ర వివాదానికి దారితీసింది. సన్ గ్రూప్ యజమాని కావ్య మారన్, హెడ్ కోచ్ డానియల్ వెట్టోరి ఆధ్వర్యంలో సుమారు రూ. 2.34 కోట్ల భారీ ధరకు అబ్రార్‌ (Abrar Ahmed)ను కొనుగోలు చేశారు. అయితే, గతంలో అబ్రార్ అహ్మద్ భారత సైన్యాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నిర్ణయంపై భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెట్టింట బాయ్​కాట్​ SRH అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. వెరీ షేమ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నిరసనల సెగ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ (Sunrisers) హైదరాబాద్‌పై కూడా పడింది. వేలం జరిగిన కొద్ది గంటల్లోనే సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా సస్పెండ్ కాగా, ఎస్‌ఆర్‌హెచ్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కూడా భారీగా తగ్గిపోతోంది.

Read Also: 2.5 ఎకరాల్లో స్లమ్ ఏరియా సెట్.. నాని మూవీ కోసం భారీగా ఖర్చు

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>