కలం, వెబ్ డెస్క్: ఈ నెల 8, 9న శ్రీశైలం రూట్ లో వెళుతున్నారా? అయితే, మీరు ట్రాఫిక్ లో చిక్కుకున్నట్లే. సోమ, మంగళవారాల్లో రాజధానిలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ –2025 (Global Summit 2025) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నగర శివారులోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కారణంగా ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యామ్నాయ మార్గాలపై పోలీసులు అలెర్ట్ జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేట, ముచ్చర్ల మధ్య ఉన్న ఫ్యూచర్ సిటీ చేరుకోవడానికి శ్రీశైలం జాతీయ రహదారి ఎన్ హెచ్ 765పై వీడియోకాన్ జంక్షన్ మీదుగా తుక్కుగూడ, ఓఆర్ఆర్ రోటరీ (ఎగ్జిట్ నెం.14), హర్షగూడ, మహేశ్వరం గేట్, కొత్తూరు ఎక్స్ రోడ్స్, పవర్ గ్రిడ్ జంక్షన్ మీదుగా ప్రధాన రహదారిగా నిర్ణయించారు.
అలాగే తుక్కుగూడ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెం.14 వద్ద రావిర్యాల మీదుగా రెండో రూట్ ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచి బొంగులూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 12 మీదుగా నాగార్జున సాగర్ హైవేపై మంగళ్ పల్లి ఎక్స్ రోడ్స్ చేరుకొని అక్కడి నుంచి ఇబ్రహీం పట్నం, అగపల్లి (కుడి వైపు టర్న్), తోలేకలాన్ (పెటుల్ల), గుమ్మడవెల్లి (ఎడమ వైపు టర్న్), ఆకులమైలారం, మీర్ ఖాన్ పేట (రైట్ టర్న్), వైకుంఠ తాండా మీదుగా పవర్ గ్రిడ్ జంక్షన్ (రైట్ టర్న్) చేరుకోవాలి. అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకోవచ్చు. అలాగే శ్రీశైలం హైవేపై కొత్తూరు ఎక్స్ రోడ్స్ వద్ద సిటీలోకి వచ్చే వాహనాలను మళ్లిస్తారు. కొత్తూరు ఎక్స్ రోడ్స్ నుంచి కొత్తూరు, జైత్వారం, పులిమామిడి, మహేశ్వరం, మన్సాన్ పల్లి ఎక్స్ రోడ్స్, నగరం విలేజ్, పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెం.15 మీదుగా వాహనాలు వెళ్లాలి. అలాగే ఓఆర్ఆర్ మీదుగా వచ్చి తుక్కుగూడ వద్ద శ్రీశైలం హైవే పైకి వెళ్లే భారీ వాహనాలు కూడా ఇదే మార్గంలో అంటే తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెం.14 నుంచి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెం.15కు చేరుకోవాలని పోలీసులు చెప్పారు.
సమ్మిట్ ప్రాంగణంలో పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు:
గ్లోబల్ సమ్మిట్ (Global Summit) ప్రాంగణంలో వాహనాలకు ఏడు పార్కింగ్ ఏరియాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రతి పార్కింగ్ ఏరియాకు క్యూఆర్ కోడ్ ఇచ్చారు. దీనిలోని నేవిగేషన్ ద్వారా పార్కింగ్ ఏరియాకు చేరుకోవచ్చు. అలాగే ఫ్యూచర్ సిటీకి వచ్చేవాళ్లు ముందుగానే సరిగా ప్లాన్ చేసుకోవాలని, ప్రత్యామ్నాయ దారులు చూసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీసులు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్ పక్కన వాహనాలు పార్క్ చేయవద్దని కోరారు.
Read Also: రెండేళ్లు vs పదేళ్లు.. బీఆర్ఎస్ కొత్త ఎత్తుగడ
Follow Us on: Youtube


