కలం, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని.. సన్న బియ్యం, ఉచిత బస్సు తమ మిగిలిన హామీలను పక్కన పెట్టిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాగా ఈ ఆరోపణలకు తాజగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేశారని ప్రశ్నించారు?
డిపాజిట్ కోల్పోయిన పార్టీ విమర్శించడమా?
కేంద్రంలో కీలక పదవి చేపట్టినా రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయన పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితికి చేరిందని, ఇలాంటి పార్టీకి తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదని మహేష్‌కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. ప్రజల్లో నమ్మకం కోల్పోయిన బీజేపీ ఇక్కడి రాజకీయ వాతావరణంపై వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పేర్కొన్నారు.
ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా Global Summit
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తోందని, ప్రపంచ దృష్టిని ఆకర్షించే గ్లోబల్ సమ్మిట్‌ను ఈరోజు గర్వంగా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ నేతలు నిజాలను అర్థం చేసుకోకుండా విమర్శలకే పరిమితమవుతున్నారని, ప్రజలు వారి మాటలను విశ్వసించే పరిస్థితి లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు.
Read Also: రెండేళ్లు vs పదేళ్లు.. బీఆర్ఎస్ కొత్త ఎత్తుగడ
Follow Us On: Pinterest


