Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం..

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ (Registrations Department) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీతో 2025 – 26 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో భూ రిజిస్ట్రేషన్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని డ్యాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పని వేళలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఈ నెల 28, 30, 31 తేదీల్లో అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాలు (Sub Registrar offices) పనిచేయనున్నాయి. ఉదయం 9.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఆఫీసులు పని చేస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. సెలవులు తీసుకోకుండా పనిచేయాలని సిబ్బందికి, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ స్లాట్ల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>