బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవులు

కలం, వెబ్ డెస్క్ : బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు (Bank Holidays) రాబోతున్నాయి. సాధారణంగా బ్యాంకులకు వరుసగా రెండు రోజులు సెలవులు వస్తేనే అనేక లావాదేవీలు ఆగిపోతుంటాయి. కానీ ఇప్పుడు మూడు రోజులు రాబోతున్నాయి. మార్చి 27న శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా సెలవుదినం. ఆ తర్వాత నాలుగో శనివారం కావడంతో ఆ రోజు కూడా బ్యాంకులకు సెలవే. ఇక ఆదివారం ఎలాగూ బ్యాంకులు పనిచేయవు. కాబట్టి ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు రాబోతున్నాయి. ఇక బ్యాంకులు మూసి ఉన్నా సరే ఆన్ లైన్ లావాదేవీలు మాత్రం జరుగుతాయి. తిరిగి బ్యాంకులు సోమవారం ప్రారంభం అవుతాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>