తాడిప‌త్రి బాలుడి హత్య కేసు నిందితుడిపై పోలీసుల కాల్పులు

క‌లం, వెబ్ డెస్క్‌: అనంతపురం జిల్లాలోని తాడిప‌త్రి (Tadipatri)లో బాలుడి హ‌త్య కేసులో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలుడిని త‌న బావ స‌ర్వేష్‌ కిడ్నాప్ చేసి హత్య చేసిన విష‌యం తెలిసిందే. నిందితుడిని పోలీసులు బుధ‌వారం అరెస్ట్ చేశారు. ఈ నేప‌థ్యంలో క్రైమ్ సీన్‌ని రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితుడు స‌ర్వేష్ పారిపోయేందుకు ప్ర‌య‌త్నించాడు. ఈ క్ర‌మంలో పోలీసులపై దాడికి పాల్ప‌డ్డాడు. బీరు బాటిల్ తో దాడి సీఐ రామసుబ్బయ్య, మరో కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో స‌ర్వేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడిని పోలీసులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నిందితుడి దాడిలో సీఐ, మ‌రో కానిస్టేబుల్‌కు కూడా గాయాల‌య్యాయి. కుంద‌న‌కోట అట‌వీ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అత్త‌మామ‌లు త‌మ‌ను స‌రిగా చూడ‌టం లేద‌న్న కోపంతో ఏడేళ్ల బాలుడు హేమ‌చంద్ర‌ను స‌ర్వేష్ కిడ్నాప్ చేసి హ‌త్య చేశాడు. తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలోని కోన ఉప్పలపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>