కలం, వెబ్ డెస్క్: తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కీలక ప్రకటన చేసింది. వెబ్‌సైట్ అనుబంధ ఆన్‌లైన్ సేవల (Registration Services) సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26 నుంచి 28 వరకు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అయిదేళ్ల తర్వాత సర్వర్ నిర్వహణ పనులు చేపడుతున్నట్లు వివరించారు. సర్వర్ వ్యవస్థలు మరింత సజావుగా పనిచేయడం, భద్రతా ప్రమాణాలు బలోపేతం, సేవల నాణ్యత మెరుగుపరిచేందుకే అప్డేషన్ చేస్తున్నామన్నారు.
జూన్ 26న మొహర్రం, జూన్ 28న ఆదివారం సెలవు ఉంటుందని, జూన్ 27న ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వ పనిదినంలో రిజిస్ట్రేషన్ సేవలకు (Registration Services) అంతరాయం కలుగుతుందని స్పష్టం చేశారు. సాధారణ ప్రజలకు కలిగే అసౌకర్యం తక్కువగా ఉండేలా షెడ్యూల్ రూపొందించామని తెలిపారు. ప్రజలు రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను ఇందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని.. జూన్ 29వ తేదీ నుంచి అన్ని సేవలు యథావిధిగా నడుస్తాయని ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు.
Read Also: అరణ్య అర్బన్ పార్కును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Instagram

