కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ నగర శివారులో గల మాక్లూర్ మండలం చిన్నాపూర్ వద్ద ఏర్పాటు చేసిన అరణ్య అర్బన్ పార్క్ (Aranya Urban Park) ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో గురువారం గుర్రంగూడ నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అర్పన, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, వి.భుజంగ రావు, అదనపు డీసీపీ శుభం ప్రకాష్ నగ్రాలే, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. సఫారీ వాహనంలో పర్యటించి అర్బన్ పార్క్ లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఓపెన్ జిమ్ లు, వాకింగ్ ట్రాక్, ప్లే జోన్ ఏరియా, కల్వర్టులు, పర్కులేషన్ ట్యాంకులు, వాచ్ టవర్, సోలార్ ద్వారా నడిచే బోరుబావులు, రోడ్డు వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సాయన్న, డీఎఫ్ఓ సుధాకర్, సర్పంచ్ లు కే.లత, గంగాధర్, చిన్నా, విద్యార్థిని, విద్యార్థులు, అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

