కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్న మహా పాదయాత్ర(Maha Padayatra)కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) హాజరుకానున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టడంతో పాటు, ఈ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో బీజేపీ ఈ పాదయాత్ర చేపడుతోంది.
ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన వాయిదా పడింది.

