భువిని ఆడించడమే తప్పు.. ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు

కలం, స్పోర్ట్స్: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను ఆడించడంపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పుడు భువనేశ్వర్‌ను జట్టులోకి తీసుకోవడం సరైన నిర్ణయం కాదని విమర్శించాడు. అతడి స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్లకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-2తో ముగించింది. ఈ సిరీస్‌లో భువనేశ్వర్ కుమార్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు.

ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ బీసీసీఐ సెలెక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టాడు. టీ20 ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నందున భువనేశ్వర్‌ను ఆడించాల్సిన అవసరం లేదన్నాడు. వన్డే ప్రపంచకప్ కోసం అతడిని సిద్ధం చేయాలనుకుంటే ఈ నిర్ణయానికి అర్థం ఉండేదని అభిప్రాయపడ్డాడు. భువనేశ్వర్‌ను ఆడించడం వల్ల యువ బౌలర్లకు విలువైన అవకాశం చేజారిందని ఇర్ఫాన్ తెలిపాడు. మయాంక్ యాదవ్‌కు అన్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఇచ్చి ఉంటే మంచి అనుభవం వచ్చేదని పేర్కొన్నాడు.

ప్రిన్స్ యాదవ్‌కు కూడా అవకాశం కల్పించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ పిచ్‌లపై యువ బౌలర్లు ఆడితే అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి అనుభవం సంపాదించేవారని వివరించాడు. అయితే తన విమర్శలు భువనేశ్వర్ బౌలింగ్ సామర్థ్యాన్ని ఉద్దేశించినవి కావని ఇర్ఫాన్ స్పష్టం చేశాడు. అతడు మంచి బౌలర్ అని, సీనియర్ ఆటగాడని పేర్కొన్నాడు. తొలి రెండు ఓవర్లలో బాగా బౌలింగ్ చేసినప్పటికీ, పవర్‌ప్లే చివరి ఓవర్లో పరుగులు సమర్పించుకున్నాడని వివరించాడు. ఇలాంటి పరిస్థితులు ఏ ఆటగాడికైనా ఎదురవుతాయని తెలిపాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>