కలం, బజార్‌హత్నూర్: బజార్‌హత్నూర్ మండలం భూతాయి (బి) గ్రామానికి చెందిన పవర్ రోహిణి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య చికిత్స ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) నుంచి మంజూరైన రూ.5 లక్షల ఎల్‌ఓసీ చెక్కును బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav)సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని, ఆర్థిక ఇబ్బందులతో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభుత్వం ద్వారా సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందేలా చొరవ చూపిన ఎమ్మెల్యే కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

