Mobile Popup Ad
Mobile Popup Ad

రాష్ట్ర రెడ్డి ఐక్యవేదిక నూతన కార్యవర్గం ఏకగ్రీవం

కలం, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర రెడ్డి ఐక్య వేదిక (Reddy Ikya Vedika) వ్యవస్థాపక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో అలియాబాద్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు, నాయకులు పాల్గొని రెడ్డి ఐక్యవేదిక భవిష్యత్ కార్యాచరణ, సామాజిక సేవా కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెడ్డి ఐక్యవేదిక నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా నాగర్తి చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సంది తిరుపతి రెడ్డి ఎన్నికయ్యారు.

సహా అధ్యక్షులుగా పట్లోల్ల నాగిరెడ్డి, పురుమాని లింగారెడ్డి ఎన్నిక కాగా, కార్యనిర్వహక అధ్యక్షులుగా బండ గోపాల్ రెడ్డి, ఎలిమినేటి సుమన్ రెడ్డి, నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, విరాటి దేవేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా పాండురంగా రెడ్డి, నేరెళ్ల భూమ్ రెడ్డి, పోద్దుటూరి నారాయణ రెడ్డి ఎన్నికయ్యారు. కోశాధికారిగా గుర్రం పాపిరెడ్డి, కార్యనిర్వహక కార్యదర్శిగా దోంగల బాపు రెడ్డి, సహాయ కార్యదర్శులుగా ఏలేటి రాంరెడ్డి, సీహెచ్. కొండల్ రెడ్డి, రామమ్మగారి బాల్ రెడ్డి ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా యెల్మకన్నె దశమంత రెడ్డి, కొప్పుల గంగారెడ్డి, ముఖ్య సలహాదారుగా గడ్డం రమేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సమావేశంలో ఏనుగు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, రెడ్డి ఐక్యవేదిక రాష్ట్రవ్యాప్తంగా సామాజిక ఐక్యత, విద్యా ప్రోత్సాహం, యువత అభివృద్ధి, సేవా కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు సంస్థ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. నూతన రాష్ట్ర అధ్యక్షులు నాగర్తి చంద్రారెడ్డి మాట్లాడుతూ, తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ, రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి ఐక్యవేదిక ను మరింత విస్తరించి ప్రతి జిల్లాలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>