కలం, నాగార్జునసాగర్: విజయపురి నార్త్, నాగార్జునసాగర్ (Nagarjunasagar) లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలుర హాస్టల్ మెస్, మెయింటెనెన్స్ నిర్వహణకు అర్హులైన ప్రముఖ క్యాటరింగ్ సంస్థల నుండి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల నిర్వాహకులు కళాశాల ప్రాంగణంలో టెండర్ దరఖాస్తులను పొంది, నిర్ణీత గడువులోగా సమర్పించాలని కోరారు. ఈ నెల 5వ తేదీ శుక్రవారం నుండి 6వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:00 గంటల వరకు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు పొందవచ్చని చెప్పారు.
దరఖాస్తులు పూర్తి చేసి సీల్డ్ కవర్లలో ఉంచి, జూన్ 8వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2:00 గంటల లోపు కళాశాల ప్రాంగణంలోని టెండర్ బాక్స్‌లో వేయాల్సి ఉంటుందని చెప్పారు. సమర్పించిన టెండర్ దరఖాస్తులను అదే రోజు మధ్యాహ్నం 3:00 గంటలకు అధికారులు పరిశీలించి, అర్హుల వివరాలను ప్రకటించనున్నారు. టెండర్ దరఖాస్తు రుసుము రూ.1,500, ఈఎండీ రుసుము రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుందని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు కళాశాల పని దినాల్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

