epaper
Monday, February 2, 2026
spot_img
epaper

ఫోన్ ట్యాపింగ్ : కేసీఆర్ పై రేవంత్ సంచలన కామెంట్స్

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ రాజకీయాలను నేను అమెరికాలో ఉన్నా గమనిస్తూనే ఉన్నానని సీఎం రేవంత్​ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఇక్కడ ఒక కన్ను వేసి ఉంచాను. అక్కడి క్లాసుల గురించి నారాయణ కూడా నన్ను అడిగారు, వివరాలు చెప్పాను. ఒక క్రమశిక్షణ కలిగిన విద్యార్థిగా నేర్చుకోవడానికి వెళ్లాను. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు వింతకు దారితీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ మధ్య కాలంలో కొంతమంది తెలంగాణ జాతిపిత అని వారికి వారే టైటిల్ ఇచ్చుకుంటున్నారు. ఉద్యమకారుడు అనే పదాలనూ వారే రాసుకుంటున్నారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే, ఆ జాతిపితకు ఇవ్వడమంటే మొత్తం సమాజానికి ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఉద్యమకారుడిని ఇలా అవమానిస్తారా అని అంటున్నారని రేవంత్ అన్నారు. ఆనాటి జాతిపిత ఆదర్శంగా నిలబడ్డారు. ఆయన తన కుటుంబం కోసం ఏమైనా అడిగారా? ఏమైనా తీసుకున్నారా? ముప్పై సంవత్సరాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కొట్లాడారు. అయితే ఆనాడు దేనికి ఆదర్శంగా నిలబడ్డారు? కుటుంబం కోసం ఆయన అడగలేదు, స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే చనిపోయారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

ఈనాడు జాతిపిత, ఉద్యమకారులు అని చెప్పుకునేవారు రాజకీయ పార్టీలు వైఫల్యం చెందినట్లు అనిపిస్తే, జేఏసీకి చైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరాంను ముందు పెట్టుకుని రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆయన ఉద్యమకారుడు. పార్టీలను, కుల సంఘాలను, మత సంఘాలను, చివరకు భిక్షగాళ్లను, రిక్షా డ్రైవర్లను కూడా జేఏసీగా ఏర్పాటు చేయలేదా? జానారెడ్డి ఇంటి దగ్గరి నుంచి కోరి, జేఏసీలోకి ఆర్‌ఎస్‌యూ నుంచి ఆర్‌ఎస్‌ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసిన కోదండరాం ఉద్యమకారుడు కాదా? ఆయన ఉద్యమాన్ని ముందుకు నడిపించారని రేవంత్​ రెడ్డి (Revanth Reddy) అన్నారు. అలాంటి ఉద్యమకారుడి ఇంటి తలుపుల్ని బద్దలు కొట్టి బైటకు ఈడ్చుకొచ్చారు గదా.. ఆయన చేసిన తప్పేంది అని ప్రశ్నించారు. కొదండరాం కు జరిగింది నిజమైన అవమానం అని ఈ సందర్భంగా రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు.

 Read Also: జైపాల్ రెడ్డి ఓడిపోవడానికి కారణం నేనే : సీఎం రేవంత్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>