epaper
Monday, February 2, 2026
spot_img
epaper

భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడం బాధాకరం: అఫ్రిదీ

కలం, స్పోర్ట్స్​ : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌తో మ్యాచ్ జరగకపోవడం బాధాకరమని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వ నిర్ణయానికి తాను మద్దతుగా ఉంటానని కూడా తెలిపారు. గత ఆదివారం పాకిస్తాన్ ప్రభుత్వం 20 జట్లతో జరిగే ఈ టోర్నీలో పాల్గొంటామని స్పష్టం చేసింది. అయితే ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన గ్రూప్ మ్యాచ్‌కు మాత్రం జట్టు బరిలోకి దిగదని ప్రకటించింది.

ఈ నిర్ణయం ప్రధాని మియాన్ ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్, పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) మధ్య జరిగిన కీలక సమావేశం తర్వాత వెలువడింది. ఆ సమావేశం అనంతరం పాకిస్తాన్ పాల్గొనడం, మ్యాచ్‌లపై తుది వైఖరి ఖరారైంది. తాజా పరిణామాలపై అఫ్రిది (Shahid Afridi) ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. రాజకీయ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ క్రికెట్ దేశాల మధ్య వారధిగా పనిచేసిందని ఆయన గుర్తు చేశారు.

ఈ సందర్భంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) కూడా బాధ్యత తీసుకోవాలని అఫ్రిది సూచించారు. ప్రకటనలతో కాకుండా నిర్ణయాల ద్వారా న్యాయ సమత్వంపై తమ నిబద్ధతను చూపాల్సిన సమయం ఇదని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ (T20 World Cup) 2026లో పాకిస్థాన్ ప్రయాణం ఎలా కొనసాగుతుందన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవనుంది.

Read Also: పాక్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చు: గవాస్కర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>