epaper
Monday, February 2, 2026
spot_img
epaper

జైపాల్ రెడ్డి ఓడిపోవడానికి కారణం నేనే : సీఎం రేవంత్

కలం, డెస్క్ : కాంగ్రెస్ దివంగత నేత జైపాల్ రెడ్డి (Jaipal Reddy) తన వల్లే 2014 ఎంపీ ఎన్నికల్లో 2వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని.. అయినా తనను ఎన్నడూ ద్వేషించలేదని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy). 2019 ఎన్నికల్లో పోటీ చేయమని కోరానని.. గతంలో జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకుంటామని చెప్తే ఆయన ముందుకు రాకుండా కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ తరానికి జైపాల్ రెడ్డితో పాటు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆదర్శం అని సీఎం తెలిపారు. సోమవారం నిర్వహించిన రావి నారాయణరెడ్డి (Ravi Narayana Reddy) జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మనందరికీ రావి నారాయణ రెడ్డి ఎంతో స్పూర్తి దాయకం. మాత్రం నిర్దిష్ట లక్ష్యం, ఆశయం కోసమే పనిచేశారు.

ఆయనకు వారసత్వంగా వచ్చిన 500 ఎకరాల భూమిని పేదలకు పంచారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన పాత్ర ఎనలేనిది. ఆ పోరాటంతోనే ఆయనకు ప్రజల్లో గుర్తింపు వచ్చింది. స్వేచ్ఛ కోసం, వెట్టిచాకిరి కోసం కోసం పోరాడిన వ్యక్తి రావి నారాయణ’ అంటూ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి రావి నారాయణ రెడ్డి అని.. అందుకే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించే అవకాశం ఆయనకు దక్కినట్టు సీఎం రేవంత్ తెలిపారు. రాజకీయాల్లో మొదటితరం నాయకుల్లో స్ఫూర్తి నింపిన రావినారాయణ రెడ్డి పేరు మీద జాతీయ పురస్కారాలు తీసుకురావడం గొప్ప విషయం అని.. తొలి అవార్డును జస్టిస్ సుదర్శన్ రెడ్డికి దక్కడం వల్ల ఆ అవార్డుకు మరింత గౌరవం దక్కిందన్నారు సీఎం రేవంత్.

ప్రజల హక్కులను హరిస్తే తిరుగుబాటే వస్తుందని.. రాజకీయాల్లో ఉన్నతంగా మెదిలితేనే తరాలు గుర్తుపెట్టుకుంటాయని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ‘ఒకప్పటి రాజకీయాల్లో ఎంతో హుందాతనం ఉండేది. ప్రజలు వ్యతిరేకిస్తే పదవులకు రాజీనామాలు చేసేవారు. కానీ నేటి తరంలో ప్రజలు ఛీ కొట్టినా పదవులను వదులుకునేందుకు పొలిటికల్ లీడర్లు ఇష్టపడట్లేదు. నేటి తరంలో దివంగత జైపాల్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి మనకు ఆదర్శం’ అంటూ వివరించారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).

Read Also: తెలంగాణకు మూడు బుల్లెట్​ ట్రైన్స్​ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>