ఉసిరికాయలపల్లిలో పేకాట స్థావరంపై మెరుపు దాడి

కలం, కారేపల్లి: ఖమ్మం జిల్లా ​సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి (Usirikayalapally) శ్రీ కోట మైసమ్మ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలోని జామ తోటలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు బుధవారం మెరుపు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు బ్లూ కోల్ట్స్, పోలీస్ సిబ్బందితో కలిసి స్థానిక ఎస్సై వి. రమేష్ ఈ హఠాత్ తనిఖీలు నిర్వహించారు.

​ఈ తనిఖీల్లో బోడ సంతోష్, లాకవత్ చింటు, మూడు వినోద్, భూక్యా రాజేష్, లాకవత్ రత్నం, మూడు రవి అనే ఆరుగురు వ్యక్తులు రహస్యంగా పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మిగతా నలుగురు పరారయ్యారు.

​అదుపులోకి తీసుకున్న నిందితుల వద్ద నుంచి రూ.13,200 నగదు, ఒక ఆటో, రెండు మొబైల్ ఫోన్లు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఆయన, మండలంలో జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>