బాసర ఐఐఐటీ విద్యార్థులకు నిరంతరం సురక్షిత తాగునీరు అందించాలి: కలెక్టర్

కలం, బాసర: బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT) లో విద్యార్థులకు నిరంతరం పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. బుధవారం బాసర ఐఐఐటీ (ఆర్జీయూకేటీ)లో విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, క్యాంపస్‌లో నీటి సరఫరా సమస్యలు (Water Supply Issues), ఇతర ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తాగునీటి నాణ్యతను పరీక్షించి, శుద్ధి చేసిన నీటిని మాత్రమే విద్యార్థులకు అందించాలని సూచించారు.

నీరు ఎక్కడ కలుషితమవుతుందో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, తాగునీటితో పాటు రోజువారీ అవసరాలకు సరిపడా నీటిని నిరంతరం సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యార్థులు తమ సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఐఐఐటీ ఉపకులపతి గోవర్ధన్, ఓఎస్డీ మురళి దర్శన్, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>