Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. ప్రభుత్వ సేవల అమలుపై దిశానిర్దేశం

కలం, వెబ్ డెస్క్: అమరావతి రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, క్షేత్ర స్థాయి సిబ్బందితో సీఎం చంద్రబాబు (CM Chandrababu) టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 వేల మంది ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను టెలీకాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి వివరించారు. ప్రభుత్వ సేవల అమలు, అర్జీల పరిష్కారంపై సీఎం దిశానిర్దేశం చేశారు. దీనిపై క్షేత్ర స్థాయిలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నచిన్న పనులైనా వెంటనే స్పందించాలని.. సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలగాలని… అదే బ్రాండుగా మారాలని ఆకాంక్షించారు. తక్కువ ఖర్చుతో ఇంపాక్ట్ చూపించేలా పనితీరు మెరుగుపర్చుకోవాలని సీఎం దిశానిర్ధేశం చేశారు. వేసవిలో తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలన్నారు.

గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని సీఎం (CM Chandrababu) అన్నారు. అందరి సహకారం వల్లే బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ప్రతీ ఒక్కరి సహకారం వల్లే వ్యవస్థలు గాడిలో పడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు. 2047 స్వర్ణాంధ్ర సాధనకు లక్ష్యాలు పెట్టుకున్నామని.. పది సూత్రాలను అమలు చేస్తున్నామని వివరించారు. 23 నెలల్లో రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామన్నారు. 24 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు వచ్చాయని తెలిపారు. గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్ వంటి కీలక ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. త్వరలో బీపీసీఎల్ వంటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకుంటామని సీఎం వివరించారు. కిందిస్థాయి ఉద్యోగులు సీఎంతో నేరుగా మాట్లాడినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

Read Also: మరింత పారదర్శకంగా పంచాయతీరాజ్ శాఖ.. పవన్ కల్యాణ్ దిశానిర్దేశం

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>